Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్

Mayor inspects in Lakdi Ka pool Hotel
Advertisement
  • పలు రెస్టారెంట్‌లలో ప్రమాణాలకు దూరంగా చికెన్ నిల్వ చేసి ఉండటంపై ఆగ్రహం
  • లక్డీకాపూల్ మొఘల్ రెస్టారెంట్‌లో తనిఖీ చేసిన మేయర్ విజయలక్ష్మి
  • కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం
Advertisement
మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు హోటల్స్, రెస్టారెంట్లలో ప్రమాణాలకు దూరంగా చికెన్ నిల్వచేసి ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆమె లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్ తదితర చోట్ల తనిఖీలు చేశారు. కలుషిత ఆహారం ఉందంటూ మేయర్ హోటల్ యాజమాన్యం, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొఘల్ రెస్టారెంట్ హోటల్‌లో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ప్రమాణాలు పాటించకుండా మాంసం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిల్వ చేసిన మాంసం శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. నివేదిక వచ్చాక, అవసరమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 
Advertisement
Advertisement
Hyderabad
Hotel
GHMC

More Telugu News